అఖిలభారత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జీనిరామమూర్తి కుటుంబం ఇటీవల శ్రీశైలం బ్రహ్మరాంబికమళ్లికార్జున స్వామి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలంలోని పద్మశాలి అన్నసత్రంలో బస చేశారు. శ్రీశైలంఅన్నసత్రం అభివృద్ధి కొరకు తన వంతుగా లక్ష రూపాయల విరాళం ఇచ్చారని అన్నసత్రం అధ్యక్షులు వర్కాలసూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి : పొన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జీని రామ్మూర్తిదంపతులను అన్నసత్రం కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ కృష్ణ మరియు పద్మశాలికులబాంధవులు పాల్గొన్నారు.
Go on Top
Padmashalis Hospital
Bheema Financial Services
Non Profit Organization