నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు ఆచార్య రవ్వా శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్ లోని సీతారాంబాగ్లో కల సంస్కృత కళాశాలలో […]
అఖిలభారత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జీనిరామమూర్తి కుటుంబం ఇటీవల శ్రీశైలం బ్రహ్మరాంబికమళ్లికార్జున స్వామి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలంలోని పద్మశాలి అన్నసత్రంలో బస చేశారు. శ్రీశైలంఅన్నసత్రం అభివృద్ధి కొరకు తన వంతుగా లక్ష రూపాయల విరాళం ఇచ్చారని అన్నసత్రం అధ్యక్షులు వర్కాలసూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి : పొన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జీని రామ్మూర్తిదంపతులను అన్నసత్రం కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ కృష్ణ మరియు పద్మశాలికులబాంధవులు పాల్గొన్నారు.
తెలంగాణలో రైతు బీమా తరహాలో.. నేత కార్మికులకు ‘ ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఇందులో భాగంగా చేనేత, పవర్‌లూమ్, యాన్సిలరీ ‘ వర్కర్స్ మరణిస్తే LIC ద్వారా రూ.5 లక్షల బీమాఅందించనుంది. రాష్ట్రంలోని 55,072 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. నిన్న ఈ పథకం కోసం | రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3rd May 2022